Search

2016 : అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం

కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ 18 డిసెంబర్ 2015 న దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Dec 23, 2015 17:35 IST
facebook IconTwitter IconWhatsapp Icon

2016: అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం

కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ 18 డిసెంబర్ 2015 న దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ చర్యలు ఐక్యరాజ్యసమితి ప్రారంభించిన 2016 అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం విధానంలో భాగంగా ఉన్నాయి.

ఐక్యరాజ్యసమితి 10 నవంబర్ 2015 న ఇటలీ లోని రోమ్ లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఓ) ప్రధాన కార్యాలయం వద్ద దీనిని ప్రారంభించింది. ఇది ఒక స్థిరమైన భవిష్యత్తు కోసం పుష్టికరమైన గింజలు అనే థీమ్ తో ప్రారంభించబడింది.

పప్పుధాన్యాల యొక్క అనేక ప్రయోజనాల గురించి జాగృతిని పెంచడానికి, వాటి ఉత్పత్తి మరియు వ్యాపారమును పెంచడానికి, మరియు ఆహార గొలుసు అంతటా కొత్త మరియు తెలివిగా ఉపయోగాలను ప్రోత్సహించడం ఈ విధానం యొక్క ప్రయోజనంగా చెప్పవచ్చు.

సంప్రదాయ ఆహారాలలో భాగంగా మరియు తరచూ చిన్న రైతులు సాగు చేసేవిగా చెప్పబడే పప్పుధాన్యాలు అధిక సంఖ్యలో జనాభా కలిగిన ప్రాంతాలలో ముఖ్యంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు ఆసియాలో ఆహార భద్రత కోసం ముఖ్యమైన ఆహార పంటలుగా ఉన్నాయి.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS