Search

2015 – 16 కేంద్ర బడ్జెట్: ముఖ్యాంశాలు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 28 ఫిబ్రవరి 2015న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Feb 28, 2015 14:09 IST
facebook IconTwitter IconWhatsapp Icon

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 28 ఫిబ్రవరి 2015న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ...

మొత్తం బడ్జెట్ - కేటాయింపులు
• కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు
• ప్రణాళికా వ్యయం రూ.4,65,000
• ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు
• రక్షణకు రూ.2,46,727 కోట్లు  
• వైద్యానికి రూ. 3,31,500 కోట్లు
• విద్యా రంగానికి రూ.68,960 కోట్లు
• గృహనిర్మాణాలకు రూ.22,407 కోట్లు
• మహిళా శిషు సంక్షేమం రూ.10,500 కోట్లు
• జల వనరులకు రూ.4,173 కోట్లు
• ఏపీలో  ఐఐఎం ఏర్పాటు
• సోలార్ ఎలక్ట్రికల్ వాహనాలకు రూ.70 కోట్లు
• నిర్భయ ఫండ్ కు వెయ్యి కోట్లు
• ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు
• మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
• ఎంజీఎన్ రేగాకు రూ.5 వేల కోట్లు
• అల్ట్రా మెగా పవర్ కు లక్ష కోట్లు.
• ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు
• గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు
• వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం.
• మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
• నాబార్డుకు 25 వేల కోట్లు
• ఐటీ హబ్ ఏర్పాటుకు 150 కోట్లు
• శిషు సంరక్షణకు 300 కోట్లు
• చైల్డ్ డెవలప్ మెంట్ కు 1500 కోట్లు
• మౌలిక వసతులకు 70 వేల కోట్లు
• స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి
• చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు
•  స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు     
•గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు.
 
కొత్త పథకాలు
• ఏడాదికి 330తో ప్రమాద బీమా
• వీసా ఆన్ అరైవల్ స్కీం కింద 150 దేశాలు
• అశోక చక్ర ముద్రతో బంగారు నాణేలు
• 4 వేల మెగా వాట్ల సామర్థ్యం గల 5 మెగా పవర్ ప్లాంట్లు ఏర్పాటు.
• సీనియర్ సిటిజన్ల కోసం వెల్ఫేర్ ఫండ్.
• అటల్ పెన్షన్ యోజన కొనసాగుతుంది
• యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటు ఏర్పాటుకు కృషి
• అత్యున్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత.
• 80 వేల స్కూళ్ల ఆధునీకీకరణ
• భారత్ ను తయారీ రంగానికి హబ్ గా చేస్తాం
• కేంద్రం పన్నుల్లో 62శాతం నిధులను రాష్ట్రాలకు ఇస్తాం
• జన్ ధన్ యోజన ద్వారా మధ్య తరగతి పేదలకు బీమా సౌకర్యం
• గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది.
• లక్ష రూపాయలు దాటిన ప్రతి లావాదేవీకి పాన్ నెంబర్ తప్పనిసరి
• బ్లాక్ మనీ నిరోధానికి కొత్త చట్టం
• విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే ఏడేళ్ల జైలు శిక్ష
• డిజిటల్ ఇండియాలో భాగంగా ఐదు లక్షల గ్రామాల్లో వైఫై సౌకర్యం
• వెనుకబడిన రాష్ట్రాలతోపాటు ఏపీకి ప్రత్యేక సాయం
• ఉపాధి కల్పనకు నేషనల్ స్కిల్ మిషన్
• పన్ను ఎగవేత దారులకు జైలు శిక్ష పదేళ్లకు పెంపు
• ఉన్నత విద్యకోసం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం
• డిజిటల్ ఇండియాలో తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
 
హామీలు
• 12.5 కోట్ల కుటుంబాలకు జనధన్ యోజన
• 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తాం.
• ఎంపీలందరూ గ్యాస్ సబ్సిడీలను వదులుకోవాలి.
• సబ్సిడీలు హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది.
• ఏడాదికి రూ.12 బీమాతో రూ.2 లక్షల ప్రీమియం.
• నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ
• ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి తగ్గిస్తాం.
• ప్రతి కుటుంబంలో ఒకరైనా ఉద్యోగాలు కలిగి ఉండేలా చేస్తాం
• ఇండియాను తయారీ రంగం ద్వారా వృద్ధిలోకి తెస్తాం
• స్కిల్ ఇండియా.. మేక్ ఇండియాకు మరింత ప్రాధాన్యం
• 2015-16 వ్యవసాయానికి 8.5 లక్షల రుణాలు ఇస్తాం
• స్కాలర్ షిప్ లు, ఎల్పీజీ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకే.
• 11.5 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సీడీ అందించాం.
• యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
• ద్రవ్యోల్భణం 5.1శాతానికి తగ్గింది
• లక్ష కిలో మీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో లక్ష కిలోమీటర్లు నిర్మాస్తాం
• పన్నుల్లో రాష్ట్రాలకు 42శాతం ఇస్తున్నాం
• ఆధార్ జన్ ధన్ ద్వారా లబ్ధిదారులకు పథకాలు వర్తిస్తున్నాయి
• వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
• 2022 నాటికి గ్రామాల్లో 4 కోట్లు, పట్టణాల్లో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం
• త్వరలో రెండంకెల వృద్ధిరేటును చేరుకుంటాం.
• 2020 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం.
• ప్రతి ఇంటకి మరుగ దొడ్డి, తాగునీరు అందిస్తాం.
• ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్సిస్తాం.
• ఏపీ తెలంగాణ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తాం
• బీహార్, బెంగాల్ తోపాటు ఏపీ ఆర్థిక సాయం
• గోల్డ్ లోన్ల పథకం స్థానంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్
• హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టోంబ్స్  రక్షణకు నిధులు
 
పన్నుల విధింపులు
• హెల్త్ ఇన్స్యూరెన్స్ లిమిట్ రూ.25వేలకు పెంపు
• సర్వీస్ ట్యాక్స్ 14శాతం పెంపు
• పెరగనున్న సిగరెట్ ధరలు
• ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రాయితీ.. 15 వేల నుంచి 25 వేలకు పెంపు
• సీనియర్ సిటిజన్లకు ఇది 10 వేల నుంచి 30వేలకు పెంపు    
• పెన్షన్ ఫండ్ కు చెల్లింపులపై రాయితీ 1 లక్ష నుంచి 1.5 లక్షలకు పెంపు
• బినామీ ఆస్తులపై కొరడా ఝులిపిస్తాం
• సంపద పన్ను రద్దు
• కోటి రూపాయల ఆదాయం దాటితే 2శాతం అదనపు పన్ను
• వెయ్యి రూపాయలు దాటిన పాదరక్షలపై ఆరు శాతం సుంకం
• బొగ్గు మీద క్లీన్ ఎనర్జీ సెస్ 100 నుంచి 200 పెంపు
• సంపద పన్నుపై 2శాతం అదనపు సర్ చార్జీలు
• 2015-16 మధ్య ఆర్ధిక అభివృద్ధి 8 నుంచి 8.5శాతం పెరిగే అవకాశం
• జీడీపీ వృద్ది రేటు 7.8 శాతం ఉంది.. ఇది మరింత పెరగనుంది
 పన్నుల తగ్గింపులు.. మినహాయింపులు..
• స్వచ్ఛ భారత్ కు అందించే నిధులకు వందశాతం పన్ను మినహాయింపు
• తగ్గనున్న బూట్ల ధరలు.. లెదర్ గూడ్స్ పై ఆరుశాతం పన్ను తగ్గింపు
• ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ కింద 1600వరకు మినహాయింపు
• 80 ఏళ్లు దాటిన వారికి 30 వేల వరకు వైద్య బిల్లులు పన్ను నుంచి మినహాయింపు
• వికలాంగులకు అదనంగా 20వేల పన్ను రాయితీ
• సాంకేతిక సేవలపై పన్ను 15శాతం తగ్గింపు
• కార్పోరేట్ పన్ను 30 నుంచి 25శాతానికి తగ్గింపు. ఈ తగ్గింపు నాలుగేళ్ల పాటు వర్తిస్తుంది.    
• దవ్యోల్బణం 6శాతానికి పెరగకుండా చర్యలు తీసుకుంటాం  
• ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకుంటాం.


 ప్రసంగంలోని కీలకాంశాలు..
• రూపాయి మారకం విలువ బలపడుతోంది.      
• ఆర్థిక అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు
• ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం
• భారత్  వృద్ధి చెందుతోందని ప్రపంచమంతా నమ్ముతోంది
• 340 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకపు నిల్వలు
• పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం
• ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
• అవినీతిని అంతం చేసేందుకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
• భారత ఆర్ధిక వ్యవస్థకు బడ్జెట్ దశా నిర్దేశం చేస్తుంది
• ప్రత్యక్ష నగదు బదిలీని కూడా త్వరలో ప్రవేశపెడతాం
• జీఎస్టీ 2016 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది
• కరెంట్ అకౌంట్ లోటు  మూడుశాతం
• ఈ సమావేశాల్లోనే నల్లధనంపై బిల్లు
• మనీలాండరింగ్ చట్టాల్లో మార్పులు
• ఆదాయ పన్ను యధాతథం.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS