Search

లక్నో మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-1A కోసం కేంద్ర కేబినెట్ ఆమోదం

లక్నో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1 A 22 డిసెంబర్ 2015 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, లక్నో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1A కోసం ఆమోదం తెల్పింది.

Dec 28, 2015 05:30 IST
facebook IconTwitter IconWhatsapp Icon

లక్నో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1 A 22 డిసెంబర్ 2015 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, లక్నో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1A కోసం ఆమోదం తెల్పింది. 6928 కోట్ల రూపాయలు వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్ట్ 22 స్టేషన్లతో 22.878 కిలోమీటర్ల పొడవును కవర్ చేస్తుంది.

మొత్తం 22.878 కిలో మీటర్ల పొడవైన మార్గంలో సాధారణ మార్గం 19.438 కిలో మీటర్ల పొడవుతో 19 మెట్రో రైలు స్టేషన్లు ఉండగా అయితే భూగర్భ మార్గం 3.440 పొడవుతో మరియు మూడు భూగర్భ మెట్రో స్టేషన్లు తో ఉంటుంది. ఈ మెట్రో రైలు చౌదరి చరణ్ సింగ్ ఎయిర్ పోర్ట్ మరియు మున్షి పులియా మధ్య నడుస్తూ ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ ఖర్చు 6928 కోట్ల రూపాయలు, వీటిలో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ మరియు అధీన రుణ రూపంలో 1300 కోట్ల రూపాయలు ఇస్తుంది.

ఈ ప్రాజెక్ట్, 50:50 యాజమాన్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క సంయుక్త సంస్థగా పునర్నిర్మించబడిన లక్నో మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎల్ఎంఆర్సి) ద్వారా అమలు చేయబడుతుంది.

ఈ ప్రాజెక్టు క్రింద చెప్పబడిన చట్ట పరిధిలోకి వస్తుంది
• మెట్రో రైల్వే (పనుల నిర్మాణం) చట్టం, 1978
• మెట్రో రైల్వే (ఆపరేషన్ మరియు నిర్వహణ) చట్టం, 2002
• రైల్వే చట్టం, 1989, ఎప్పటికప్పుడు సవరించబడేది

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS