Search

ఐటి & ఎలక్ట్రానిక్స్ రంగాలలో సహకారం కోసం భారతదేశం మరియు జోర్డాన్ మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం

కేంద్ర మంత్రివర్గం 30 డిబసెంర్ 2015 న సమాచార సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు జోర్డాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) ను ఆమోదించింది.

Jan 5, 2016 18:03 IST
facebook IconTwitter IconWhatsapp Icon

కేంద్ర మంత్రివర్గం 30 డిబసెంర్ 2015 న సమాచార సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు జోర్డాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) ను ఆమోదించింది.

అక్టోబర్ 2015 లో ఇరు దేశాలు ఈ అవగాహన ఒప్పందంఫై సంతకాలు చేశాయి.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ (ఐటి &ఈ) రంగంలో రెండు దేశాల మధ్య, పారిశ్రామిక, సాంకేతిక మరియు వాణిజ్య సహకారాన్ని అభివృద్ధి చేయడం మరియు బలోపేతం చేయడం దాని ముఖ్యోద్దేశం.

 ఇది రెండు దేశాల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా సంస్థాగత మరియు సామర్థ్య నిర్మాణంలో సహకార కార్యక్రమం అమలు కోసం కూడా ప్రయత్నిస్తుంది.

 ఈ ఒప్పందం లోని ప్రధాన అంశాలు

• జోర్డాన్ యొక్క ఐటి రంగం, డిజైన్, ప్రణాళిక యొక్క నిర్దిష్ట అవసరాలను మరియు కెపాసిటీ బిల్డింగ్ ప్రాంతాలు గుర్తించి మరియు జోర్డాన్ ప్రయోజనాలకోసం ఐటి బిల్డింగ్ కెపాసిటీ కార్యక్రమాలు అమలు

• పెట్టుబడి మరియు వ్యాపార ప్రమోషన్ ప్రాంతాల్లో రెండు దేశాల ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య సహకారం

• ఈ-విద్య, ఈ-గవర్నెన్స్, ఎం-గవర్నెన్స్, ఈ-ఆరోగ్యము మరియు టెలీమెడిసిన్ యొక్క ప్రాంతాల్లో ఐటి & ఈ రంగంలో సహకారం బలోపేతం చేయడం

• నియంత్రణ విధానం మరియు అంతర్జాతీయంగా పోటీతత్వ ఐటి & ఈ తయారీ మరియు సేవా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధతో సంస్థాగత ముసాయిదా ప్రాంతాల్లో ఉత్తమ లక్షణాల మార్పిడి

• తగిన మరియు నిపుణుల మార్పిడిగా ప్రతి దేశమునందు నిర్వహించే అంతర్జాతీయ సంఘటనలలో పాల్గొనడం

• రెండు దేశాలచే సంయుక్తంగా నిర్ణయించబడిన ఇతర ప్రాంతాల్లో సహకారం

 రెండు దేశాల ప్రతినిధులతో కూడిన ఒక వర్కింగ్ గ్రూప్ స్థాపించటం ద్వారా పైన పేర్కొన్న ఐటి & ఈ విభాగాల్లో సహకారం అందించడం ఉంటుంది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS