Search

పన్ను చెల్లింపులు సులభతరం చేసేందుకు ఈ-సహ్యోగ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

27 అక్టోబర్ 2015 న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను అధికారులు ముందు భౌతికంగా హాజరవ్వక్కరలేకుండా పన్ను చెల్లింపులు సులభతరం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ, ఈ-సహ్యోగ్ పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.

Oct 30, 2015 14:08 IST
facebook IconTwitter IconWhatsapp Icon

 27 అక్టోబర్ 2015 న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను అధికారులు ముందు భౌతికంగా హాజరవ్వక్కరలేకుండా పన్ను చెల్లింపులు సులభతరం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ, ఈ-సహ్యోగ్ పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.

ఈ-సహ్యోగ్ ప్రాజెక్ట్, ముఖ్యంగా చిన్న పన్ను చెల్లింపుదారులకోసం మరియు ఖర్చు తగ్గించడం లక్ష్యంతో ప్రారంభించబడింది..

ఈ-సహ్యోగ్ ప్రాజెక్టు ముఖ్యాంశాలు

• ఆదాయపు పన్ను రిటర్న్ లలో వచ్చే తేడాలను ఆదాయపు పన్ను కార్యాలయం సందర్శించనవసరంలేకుండా, ఆన్లైన్ లోనే పరిష్కరించుకునే పద్దతిని అందించడం ఈ-సహ్యోగ్ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం.

• పన్ను మదింపులో ఉన్న తేడాలను, ఆదాయపు పన్ను శాఖ, ఇ-సేవలనును ఉపయోగించి, ఎస్ఎంఎస్ లు, ఇ-మెయిల్ ల ద్వారా పన్నుకట్టేవారికి అందిస్తుంది.

• ఇందులో, పన్నుకట్టేవారు, పన్ను మదింపులో ఉన్న తేడా సమాచారాన్ని వీక్షించడానికి, ఇ-ఫైలింగ్ పోర్టల్ సందర్శించి తమ యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ తో లాగిన్ అయ్యి సమస్యపై ఆన్లైన్ లోనే వారి ప్రతిస్పందన తెలియజేయవచ్చు.

• పన్ను చెల్లింపుదారులు సమర్పించిన ఆన్లైన్ స్పందనలు ప్రాసెస్ చెయ్యబడి, స్వయంచాలక మూసివేత నిబంధనల ప్రకారం స్పందనలు మరియు ఇతర సమాచారం సంతృప్తికరమైనదిగా ఉంటే, ఆ సమస్య మూసివేయబడినదిగా పరిగణిస్తారు.

• పన్నుచెల్లింపుదారులు ఇ-ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ అవడం ద్వారా నవీకరించబడిన స్థితిని తెలుసుకుంటారు.

మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక పాన్ శిబిరాలు నిర్వహణకు ప్రారంభోత్సవం

ప్రజల చెంతకే ప్రజా సేవలను అందించడానికి మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక పాన్ శిబిరాలు నిర్వహించే ఒక డ్రైవ్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా, ప్రత్యేక పాన్ శిబిరాలను భారతదేశ వ్యాప్తంగా నలభై మూడు సుదూర, చిన్నపట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించారు.

ఇంకా అటువంటి శిబీరాలు, ఏడాది పొడవునా జరుగుతాయి. ఈ శిబిరాలు, ఒక లక్ష రూపాయలకు పైగా కొనుగోలు లేదా అమ్మక లావాదేవీలు నమోదుకు అవసరమయ్యే పాన్ నెంబర్ ను రిమోట్, సెమీ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో నివశించే ప్రజలు పెందేందుకు సులభతరం చేస్తాయి.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS