Search

జార్ఖండ్ లో సిసిఎల్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రకటన

31 డిసెంబర్ 2015 న జార్ఖండ్ లో సిసిఎల్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్, బొగ్గు, నూతన మరియు పునరుత్పాదక శక్తి కేంద్ర సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.

Jan 5, 2016 14:10 IST
facebook IconTwitter IconWhatsapp Icon

31 డిసెంబర్ 2015 న జార్ఖండ్ లో సిసిఎల్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్, బొగ్గు, నూతన మరియు పునరుత్పాదక శక్తి కేంద్ర సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.

ఈ విశ్వవిద్యాలయం 1400 విద్యార్ధులు మరియు 15 క్రీడా అకాడమీల సామర్థ్యం కలిగి ఉంటుంది.

మొత్తం 1400 విద్యార్థులలో 700 మందిని జార్ఖండ్ నుంచి ఎంపిక చేసి, ఈ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రామాణిక కోచ్ ల ఆధ్వర్యంలో వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

ఈ విషయంలో జూన్ 2015 లో సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (సిసిఎల్) మరియు జార్ఖండ్ ప్రభుత్వం మధ్య కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (MoU) ను అమలులోకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ గురించి

• ఇది భారత బొగ్గు లిమిటెడ్ (సిఐఎల్) యొక్క అనుబంధ సంస్థ, బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క నిర్వహణలో ఉంది.

• ఈ మినీ రత్న కంపెనీ, కోల్ మైన్స్ అథారిటీ, సెంట్రల్ డివిజన్ యొక్క జాతీయం చేయబడిన బొగ్గు గనులను నిర్వహిస్తుంది.

• దీని రిజిస్టర్డ్ & కార్పొరేట్ కార్యాలయం రాంచి, జార్ఖండ్ లో ఉంది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS