Search

అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు వీరేంద్ర సెహ్వాగ్ వీడ్కోలు

20 అక్టోబర్ 2015న భారత క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లతో పాటు, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని వీరూ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Oct 20, 2015 17:11 IST
facebook IconTwitter IconWhatsapp Icon

20 అక్టోబర్ 2015న భారత క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లతో పాటు, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని వీరూ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Virender Sehwag

సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత ఆటగాడు మరియు వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 319 పరుగులు కాగా, వన్డేల్లో అత్యధిక స్కోరు 219 పరుగులు.

తొలుత బాటింగ్ చేయగల ఆఫ్ స్పిన్నర్ గా జట్టులో స్థానం సంపాదించిన సెహ్వాగ్, మిడిల్ ఆర్డర్ నుండి ఓపెనర్ గా ఎదిగాడు.  1999లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వన్డే ఆరంగేట్రం చేసిన సెహ్వాగ్ తరువాత 2001 నవంబర్ లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో చోటు సంపాదించాడు.

గణాంకాలు:

సెహ్వాగ్ 2007లో టి20, 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు.

సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 49.34 సగటుతో 23 సెంచరీలతో 8,586 పరుగులు చేశాడు.

సెహ్వాగ్ 251 వన్డేలు ఆడి 35.05 సగటుతో 15 సెంచరీలతో 8,273 పరుగులు చేశాడు.

సెహ్వాగ్ ట్వంటీ 20 ల్లో 19 మ్యాచ్ లు ఆడి 21.88 సగటుతో  394 పరుగులు చేశాడు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS