Search

హెచ్ఐవి బాధితుల యాంటీరిట్రోవైరల్ చికిత్స కోసం అన్ని పరిమితులను ఎత్తివేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) 30 సెప్టెంబర్ 2015న హెచ్ ఐవీ బాధితులకు యాంటీ వైరల్ చికిత్స (ఎఆర్ టి) కోసం ఇప్పటివరకూ ఉన్న పరిమితులను, అర్హతలను అన్నింటినీ ఎత్తివేసింది

Oct 26, 2015 17:23 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) 30 సెప్టెంబర్ 2015న హెచ్ ఐవీ బాధితులకు యాంటీరిట్రోవైరల్ చికిత్స (ఎఆర్ టి) కోసం ఇప్పటివరకూ ఉన్న పరిమితులను, అర్హతలను అన్నింటినీ ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో ఏ ప్రాంతంలోనైనా, ఏ వయసువారైనా చికిత్స తీసుకోవచ్చు.

హెచ్ ఐవీ బారినపడ్డవారు వెంటనే యాంటీరిట్రోవైరల్ చికిత్స తీసుకోవడం వల్ల ఈ వ్యాధి తమ భాగస్వాములకు సోకకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. యాంటీరిట్రోవైరల్ చికిత్స ఉపయోగాలు రసాయన ప్రయోగాలను బట్టి తెలుస్తోంది. ఆరోగ్యకరమయిన వాతావరణం పెంపొందింపచేయడానికి అవకాశం ఏర్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రతిపాదనలు, సమగ్ర నివేదిక ప్రకారం యాంటీరిట్రోవైరల్ మందులు వాడే నిబంధనలు సవరించింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం 2014 డబ్ల్యుహెచ్ వో  పురుషుల లైంగిక చర్యల వల్ల పురుషులకు వచ్చిన హెచ్ ఐవీ నిరోధానికి పి ఎక్స్ పోజర్ ప్రోపైటాక్సిస్ మందును వాడవచ్చు.

హెచ్ ఐవి ప్రమాదం ఇతర ప్రాంతాలకు, ఇతర సమూహాలకు హెచ్ ఐవీ ప్రమాదం వ్యాపించకుండా  పీఆర్ ఈపీ చికిత్స తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదనల ప్రకారం ఈ మందు సరఫరాను పెంచుతారు.

పీఆర్ ఈపీ అత్యంత సమర్ధవంతమయిన ఎయిడ్స్ వ్యాప్తి నిరోధక సాధనం. వివిధ సమగ్రమయిన వ్యాధి నివారణ చర్యలు, వివిధ ప్యాకేజీలు, హెచ్ ఐవి టెస్టింగ్, కౌన్సిలింగ్, సలహాలు, సురక్షిత ఇంజెక్షన్లు అందచేస్తారు.

కొత్త ప్రతిపాదనల ప్రకారం యాంటీ వైరల్ చికిత్స తీసుకునే హెచ్ ఐవీ బాధితుల సంఖ్య 28 మిలియన్ల నుంచి హెచ్ ఐవీ సోకినా చికిత్స ద్వారా ఇంకా జీవించి ఉన్నవారి సంఖ్య 37 మిలియన్లకు పెరిగింది.

హెచ్ ఐ వీ విధానంలో మార్సులు భవిష్యత్ అవకాశాలు
ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా అంతం చేయడానికి లక్ష్యాన్ని 2020 కి బదులు 2030 కి పెంచారు. ఇందుకోసం వ్యాధి కి జరిగే ట్రీట్ మెంట్ ను పెంచుతారు. హెచ్ ఐ వీ బారిన పడ్డ 90 శాతం మందికి దానిపై అవగాహన కల్పించడం, వారి జీవన ప్రమాణాన్ని పెంచడం చేస్తారు. ఈ 90శాతం మందికి యాంటీ వైరల్ ట్రీట్ మెంట్ , మరో 90 శాతంమంది రక్తంలో ఎలాంటి అనుమానాస్పద వైరస్ లేదని తేలింది.
గ్లోబల్ హెచ్ఐవీ పాలసీలో మార్పులవల్ల 21 మిలియన్ల మంది బతికించడానికి, 2030 నాటికి 28 మిలియన్ల మందికి కొత్తగా వ్యాధులు రాకుండా తప్పించడానికి అవకాశం ఉంటుంది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS