Search

వలసలు మరియు అభివృధ్ది సంక్షిప్తసమాచారాన్ని విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు

22 అక్టోబర్ 2015 న ప్రపంచ బ్యాంకు, ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వలసలు మరియు నగదు నగదు బదలాయింపులతో కూడిన వలసలు మరియు అభివృధ్ది సంక్షిప్తసమాచారాన్ని విడుదల చేసింది.

Oct 29, 2015 15:09 IST
facebook IconTwitter IconWhatsapp Icon

22 అక్టోబర్ 2015 న ప్రపంచ బ్యాంకు, ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వలసలు మరియు నగదు నగదు బదలాయింపులతో కూడిన వలసలు మరియు అభివృధ్ది సంక్షిప్తసమాచారాన్ని విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం, ప్రపంచ మందగమనం నేపథ్యంలో 2015లో వలస సొమ్ములో తగ్గుదల ఉన్నప్పటికీ, ఇది అభివృద్ధి చెందిన ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలు పురోగతి చెందనుండడంతో 2016 మరియు 2017 లో పెరగనుంది.

నివేదిక - ముఖ్యాంశాలు

• 2015 చివరినాటికి అభివృధ్ది చెందుతున్న దేశాలకు చెల్లింపులు కాస్త తగ్గడం వల్ల కేవలం 435 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరవచ్చు. గత ఏడాది కేవలం  2 శాతం కనీస వృధ్ది రేటు నమోదు కావడమే దీనికి కారణం.  అదే 2010-13 లో చూస్తే చెల్లింపుల వృధ్దిరేటు 7.1 శాతం కాగా., 2014 లో 3.3 శాతంగా నమోదైంది. ఈ సారి 2 శాతానికి పడిపోయింది.

• ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల నుంచి వెళ్లిన చెల్లింపులు చూస్తే., ప్రపంచ బ్యాంకు నుంచి 250 మిలియన్ బదలాయింపులు జరగగా  ఇది 1.3 శాతం వృద్ది సాధించి., 588 బిలియన్ యు. ఎస్. డాలర్లకు చేరుకోవచ్చు.

 ఈ ఏడాది .బదలాయింపులు తగ్గడం వల్ల అభివృధ్ది చెందుతున్న ప్రాంతాలపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా యూరప్ మరియు సెంట్రల్ ఆసియా ప్రాంతాలలో నగదు  లావాదేవీలు 2015 లో 18.3 శాతం తగ్గవచ్చని అంచనా. అమెరికా డాలర్ తో రూబుల్ మారకం రేటు పడిపోవడమే దీనికి ప్రధాన కారణం.

• 2016 లో అంచనాలు చూస్తే అబివృద్ది చెందుతున్న దేశాలలో చెల్లింపులు 4 శాతం పెరగవచ్చు.  ఇది 453 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. యూరప్ లో ఆర్థిక వ్యవహారాలు కాస్త పుంజుకోవడం, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ కాస్త మెరుగు పడడం వల్ల 2016 అంచనాలు పెరగవచ్చు.

• అలాగే ప్రపంచవ్యాప్తంగా చెల్లింపులు.. 2016 లో 610 బిలియన్ అమెరికా డాలర్లకు పెరగవచ్చు. 2017 నాటికి 635 బిలియన్ డాలర్లకు చేరవచ్చు.

• ఆర్థిక చెల్లింపులు, అభివృధ్దిపై ఇటీవల తీసుకువచ్చిన నిర్ణీత అభివ\ద్ది లక్ష్యాలు (SDGs) మరుయు ఆదీస్ అబాబా యాక్షన్ అజెండా విధానాల వల్ల బదలాయింపులు మెరుగు పడే అవకాశం ఉంది. మానవుల అక్రమ రవాణా తగ్గడం., వలస కూలీలకు మంచి కార్మిక విధానాల అమలు లాంటి సానుకూల పరిస్తితుల వల్ల మెరుగుదల ఉండవచ్చు.

• ఈ ప్రతిపాదిత అజెండా అనేది బ్యాంకుల రిస్క్ ప్రమాదాన్ని అరికట్టడం., ఆర్థిక నిబంధనల మూలంగా ఏర్పడే ప్రతికూల అంశాలను తగ్గించడంపై దృష్టి పెడుతోంది.

ఈ నివేదిక ముగింపు విషయానికి వస్తే ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒకరు వలసవాదులే. అందులో నాలుగోవంతు మంది అంతర్జాతీయ వలసవాదులు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS